తిరుపతి నాయక్ ను సన్మానించిన సునీల్ రావు
ముకరంపుర, అక్టోబర్ 6 (విజయ క్రాంతి): భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా(Bharatiya Janata Party Tribal Morcha) రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన గుగులోతు తిరుపతి నాయక్ ను బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు శాలువాతో సత్కరించి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి మరియు ఎస్టీ మోర్చా బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఆకాంక్షించారు. కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో పనిచేస్తూ రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతంనకు క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు.తనకు ఈ పదవి లభించడం పట్ల గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతిని గుగులోతు తిరుపతి నాయక్ సంతోషం వ్యక్తం చేస్తూ, సన్మానించిన యాదగిరి సునీల్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.