రాజ్యాంగ పరిరక్షణే పౌరుల ప్రథమ కర్తవ్యం

26-11-2026 | 11:50pm

కొత్తపల్లి, నవంబర్ 26(విజయక్రాంతి): భారత రాజ్యాంగం(Constitution of India) అమలులోకి వచ్చిన రోజును పురస్కరించుకొని సిపిఐ జాతీయ సమితి(CPI National Council) పిలుపుమేరకు కరీంనగర్ లోని కోర్టు చౌరస్తా వద్దగల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవంగా పాటిస్తూ అంబేద్కర్ విగ్రహానికి సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్  పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం సిపిఐ నేతలంతా రాజ్యాంగ పీఠికను పట్టిస్తూ ప్రమాణం చేశారు.

ఈ సందర్భంగా పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామ్య దేశంగా భారతదేశ ఉండాలని సంకల్పంతో భారతదేశానికి రాజ్యాంగాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందించారని, 1956 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుగా దేశమంతా సంబరాలు జరుపుకోవాల్సిన అవసరం ఉందని కానీ నేటి బిజెపి ప్రభుత్వ పాలన మూలంగా రాజ్యాంగానికి పెను ప్రమాదం పొంచి ఉందని,రాజ్యాంగంలో పొందుపరిచిన పౌరుల హక్కులను,

చట్టాలను కాపాడుకోవడం కోసం, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకోవడం కోసం భారత రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవంగా జరుపు కోవాల్సిన దుస్థితి  నేడు దేశంలో నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.రాజ్యాంగ స్ఫూర్తిని,ప్రజాస్వామ్య విలువలను, అన్ని వర్గాల ప్రజల హక్కులను, చట్టాలను బిజెపి ప్రభుత్వం తుంగలో తొక్కుతుందని, చివరకు పౌరుల ప్రాథమిక హక్కుగా ఉన్న ఓటు హక్కును కూడా తొలగించడానికి కుట్రలు చేస్తుందని అన్నారు.

భారత రాజ్యాంగం అందించిన మానవ హక్కులు,బాధ్యతలు, సమానత్వం,స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం,ప్రజాస్వామ్య విలువలు కాపాడడం కోసం  రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం దేశంలోని ప్రతీ ఒక్క పౌరుడు పోరాడాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్,బోయిని అశోక్,కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు,బీర్ల పద్మ,కొట్టె అంజలి, మచ్చ రమేష్,బామండ్ల పెల్లి యుగేందర్, బోనగిరి మహేందర్,నాయకులు సాయవేణి రాయమల్లు, బాకం ఆంజనేయులు, కేంసారం శ్రీనివాస్,అల్లేపు రాజు,తంగెళ్ళ సంపత్,ఎలిశెట్టి భారతి,చెంచల మురళి,కసిబోజుల సంతోష్ చారి,కాల్వ శ్రీనివాస్,మల్లయ్య, కూన రవి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు