ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
నిజాంసాగర్ నవంబర్ 26( విజయ క్రాంతి ): భారత రాజ్యాంగ దినోత్సవాన్ని(Constitution Day of India) పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అచ్చంపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు, ఉపన్యాస పోటీలు నిర్వహించి, భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం, ప్రజాస్వామ్య విలువలు, పౌరుల హక్కులు మరియు విధులపై అవగాహన కల్పించారు. విద్యార్థులు ఉత్సాహంగా పోటీలలో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల అభివృద్ధి అధికారి శివకృష్ణ,మండల విద్యాధికారి తిరుపతిరెడ్డి,గ్రామ ప్రథమ పౌరులు సంకు లక్ష్మయ్య , గ్రామపంచాయతీ కార్యదర్శితుకారాం,, జిపిఓ సంగమేశ్వర్ రెడ్డి ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.