ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
సిద్దిపేట క్రైం, నవంబర్ 26 : రాజ్యాంగ దినోత్సవం(Constitution Day) సందర్భంగా గురువారం సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.సుదర్శన్ భారత రాజ్యాంగ ప్రవేశికను కోర్టు సిబ్బందితో చదివించారు. కార్యక్రములో న్యాయమూర్తులు వై.జయప్రసాద్, ఎన్. సంతోష్ కుమార్, ఎ.కుమారస్వామి, బి.సాధన, వి.తరణి పాల్గొన్నారు.
రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు సిద్దిపేట శివారులోని మందపల్లిలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భారత రాజ్యాంగం ప్రాముఖ్యత, ప్రాథమిక హక్కులు, పౌరుల విధులు, సమానత్వపు హక్కు, న్యాయాన్ని పొందే హక్కు, ప్రతి ఒక్కరికీ ఉచిత న్యాయ సహాయం అందించే విధానం గురించి అవగాహన కల్పించారు. కార్యక్రములో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ రవికుమార్, ఎన్ఏసీ ఇంచార్జి లక్ష్మీనర్సింలు, కోఆర్డినేటర్ శిరీష, సిబ్బంది పాల్గొన్నారు.