రాజ్యాంగాన్ని రక్షించుకుందాం...ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
చంద్రపురి కాలనీ డివిజన్ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్.
జవహర్ నగర్ నవంబర్ 26 (విజయక్రాంతి): భారత రాజ్యాంగ (Constitution of India) పరిరక్షనే ధ్యేయంగా సాగిన చారిత్రాత్మక ర్యాలీలో ఏఐసీసీ ఇచ్చిన దేశవ్యాప్త పిలుపుమేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(Telangana Pradesh Congress Committee) అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంవిధాన్ రక్షా మార్చ్ (రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ) హైదరాబాదులోని అంబేద్కర్ విగ్రహం నుండి ఇందిరా గాంధీ విగ్రహం వరకు ఉత్సాహభరితంగా సాగింది.
ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ చంద్రపురి కాలనీ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ హాజరై మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ ప్రజాస్వామ్య విలువలను కాపాడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం అన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రాజ్యాంగ మౌలిక సూత్రాలకు ప్రజాస్వామ్య సంస్థలకు ముప్పు వాటిల్లకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ప్రతి పౌరుడు పై ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గొడుగు వేణు, సీనియర్ నాయకులు రజిత గోపాల్, ఉపాధ్యక్షులు గోనె చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శి మాధవరెడ్డి, జోగి సునీత, ఎస్సి సెల్ అధ్యక్షుడు రాహుల్ కదం, నాయకులు సాయికృష్ణ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కలేషా, రామిరెడ్డి, నర్ర మహేష్, భాస్కర్ గౌడ్ రాము నర్సింగ్ తోపాటు చంద్రపురి కాలనీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.