కరీంనగర్ డెయిరీ లో జాతీయ పాల దినోత్సవము
కరీంనగర్, నవంబరు 26 (విజయ క్రాంతి): కరీంనగర్ డెయిరీ(Karimnagar Dairy) ఆవరణలో శ్వేత విప్లవ పితామహుడు డాక్టర్ వర్గీస్ కురియన్ 105 వ జయంతి సందర్భంగా జాతీయ పాల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వర్గీస్ కురియన్ విగ్రహానికి డెయిరీ చైర్మెన్ డాక్టర్ సిహెచ్ రాజేశ్వర్ రావు పూలమాల వేసి నివాలులర్పించారు. అనంతరం పట్టణములోని శాత వాహాన యూనివర్సిటి, గీతాభవన్ చౌరస్తా, ఉమెన్స్ కాలేజ్ గ్రౌండ్లో వాకర్స్, ప్రజలు 5000 మందికి ఉచిత వేడిపాలు, మజ్జిగ పంపిణి చేశారు.
సందర్భముగా చైర్మన్ రాజేశ్వరరావు మాట్లాడుతూ వర్గీస్ కురియన్ స్ఫూర్తితో కరీంనగర్ డెయిరీని తెలంగాణ రాష్ట్రములో నెంబర్ వన్ గా తీర్చిదిద్దామని తెలిపారు. కరీంనగర్ డెయిరీని ప్రస్తుతము రోజుకు 2,00,000 లీటర్ల పాల సేకరణ జరుపుతున్నామని,
రాబోయే కాలంలో కరీంనగర్ డెయిరీని రోజుకు 5.0 లక్షల లీటర్ల వరకు పెంచాలని, అలాగే ఇప్పటి పాల అమ్మకాలను రోజుకు 2,00,000ల లీటర్ల నుండి రాబోయే కాలములో తెలంగాణాలోని అన్ని జిల్లాలలో పాల అమ్మకాలు విస్తరించి రోజుకు 5.00 లక్షల లీటర్ల వరకు సేల్స్ పెంచాలనే ధృడసంకల్పంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమములో డైరీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పి శంకర్ రెడ్డి, డెయిరీ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.