ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

26-11-2026 | 11:42pm

కోదాడ, నవంబర్ 26:(విజయక్రాంతి): కోదాడలోని మసీదు చౌరస్తాలో గురువారం ఎమ్మార్పీఎస్ , ఎంఎస్పీ , ఎంఎస్ఎఫ్  ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ (Constitution Day of India) వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ సూర్యాపేట జిల్లా మాజీ సమన్వయకర్త ఏపూరి రాజు మాదిగ, ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు కొండపల్లి ఆంజనేయులు మాదిగ, యలమర్తి రాము మాదిగ, వడ్డేపల్లి కోటేష్ మాదిగ హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ వేడుకల్లో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు బచ్చలకూరి వెంకన్న మాదిగ, అనంతగిరి మండల అధ్యక్షులు కొండపల్లి సూర్యప్రకాష్, ఎంఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ బాధ్యులు కంచెపంగు భార్గవ్ మాదిగ, ఎమ్మార్పీఎస్ కోదాడ పట్టణ కార్యవర్గ సభ్యులు పంది వెంకటి మాదిగ, కుడుముల రాజు మాదిగ, కుడుముల వంశీ మాదిగ, కుడుముల వెంకటి మాదిగ, పిడమర్తి మధు మాదిగ, కర్ల కమల్ మాదిగ, వంగూరి శ్రీను మాదిగ, గంధం రాజు మాదిగ, దేశబోయిన ఉదయ్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు