సాయిబాబా మందిరంలో విశేష పూజలు, అన్నదానం

26-11-2026 | 11:21pm

కోదాడ నవంబర్ 26(విజయక్రాంతి): మండలంలోని నల్లబండగూడెంలో రామాపురం క్రాస్ రోడ్డు(Ramapuram Cross Road) వద్ద గల షిర్డీ సాయి బాబా మందిరంలో గురువారం సందర్భంగా విశేష పూజలు, అన్నదానం నిర్వహించారు. ఉదయం నుండే భక్తులు పూజల్లో పాల్గొనేందుకు మందిరానికి చేరుకున్నారు. కోదాడ వాస్తవ్యులు తోట ఆంజనేయ ప్రసాదు సుభాషిని రాజరాజేశ్వరి దేవి నిత్యశ్రీ సహకారంతో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నల్లపాటి నరసింహారావు, అర్చకుడు సాయి శర్మ, సుబ్బారావు, పూర్ణ, శ్యామ్, గురవయ్య, గుంజా శ్రీను , సత్యనారాయణ, సూర్యనారాయణ, ముండ్రా రామారావు, ఆదినారాయణ, నాని పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు