జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం

26-11-2026 | 11:32pm

ప్రతిభ చూపిన క్రీడాకారులకు రాష్ట్రస్థాయి పోటీలకు అవకాశం.

జవహర్ నగర్, నవంబర్ 26 (విజయక్రాంతి): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు(District-level athletics competitions) ఈ నెల 27న నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి స్టాన్లీ జోన్స్, నిర్వాహకులు రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు.అహ్మద్‌గూడలోని ఆర్మీ స్పోర్ట్స్ అకాడమీలో ఉదయం 7 గంటలకు క్రాస్ కంట్రీ పోటీలు, 8.30 గంటలకు సబ్ జూనియర్ విభాగం పోటీలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

అండర్‌–14, 16, 18, 20 విభాగాల్లో అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు తమ పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రంతో ఉదయం 7 గంటలకు ఆర్మీ స్పోర్ట్స్ అకాడమీలో హాజరుకావాలని కోరారు.పూర్తి వివరాలకు నిర్వాహకులు రాజశేఖర్‌ను 9849612733, 9599315037 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

మరిన్ని వార్తలు