డిప్యూటేషన్ల రద్దు కోరుతూ విద్యార్థులు తల్లిదండ్రుల ఆందోళన
ములకలపల్లి,నవంబర్ 26 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో(Government schools) చదువుతున్న తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఉపాధ్యాయుల డిప్యుటేషన్లను తక్షణమే నిలిపివేయాలని జగన్నాథపురం విద్యార్థుల(Jagannathpuram students) తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. గురువారం వారు జగన్నాథపురం పాఠశాల హెచ్ఎం వెంకటనర్సమ్మ కు వినతిపత్రం అందజేశారు.
ఇప్పటికే ఈ పాఠశాల నుండి ముగ్గురు ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై బయటకు పంపించారని, తాజాగా ఇంగ్లీష్ మీడియం సోషల్ టీచర్‌ను కూడా డిప్యుటేషన్‌పై పంపడం పట్ల తల్లిదండ్రులు, విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్ఎం వెంకట నర్సమ్మకు వినతి పత్రాన్ని అందజేసి విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. డిప్యూటేషన్లను రద్దు చేయాలని కోరుతూ విద్యార్థులు పాఠశాల ప్రధాన గేట్ ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు.