రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు

26-11-2026 | 11:19pm

కొత్తపల్లి, నవంబరు 26 (విజయ క్రాంతి): కొత్తపల్లి లోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలకు(Alforce E-Techno School) చెందిన విద్యార్థులు  70వ ఎస్జిఎఫ్ రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికయ్యారు. పెద్దపల్లి జిల్లాలోని ఒక ప్రవేట్ పాఠశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి ఆర్చరీ పోటీల ఛాంపియన్షిప్ లో అండర్ 17 బాలికల విభాగంలో కే లిషిత్ అక్షయ, బాలుర విభాగంలో జి శ్రీ హరినాథ్, జే ప్రణీత్,  అండర్-14 బాలుర విభాగంలో పి మాన్విత్ రెడ్డి,  బి రుత్విక్ లు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. 

అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి  విద్యార్థులకు పుష్పగుచ్ఛాలను అందజేసి అభినందించారు. త్వరలో నిర్మల్ జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలలోను ప్రతిభను కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు.  ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు