యువత శారీరక దృఢత్వానికి జిమ్‌లు దోహదం

09-11-2026 | 09:49pm

కరీంనగర్ లో మహావీర్ జిమ్ 13వ వార్షికోత్సవ వేడుకల్లో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

కరీంనగర్, నవంబర్ 09 (విజయక్రాంతి): యువత శారీరక దృఢత్వంతో(Physical Fitness of the Youth) పాటు క్రీడా నైపుణ్యాలను(Sports skills) పెంపొందించుకోవడానికి జిమ్‌లు, క్రీడా అకాడమీలు(Gyms, sports academies) ఎంతగానో దోహదపడతాయని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు(TPCC General Secretary Duddilla Srinu Babu) అన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో మహావీర్ జిమ్ 13వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన గ్రాండ్ లాంచ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహావీర్ బౌన్సర్స్ (ప్రొఫెషనల్ సెక్యూరిటీ సర్వీసెస్), మహావీర్ బాక్సింగ్ అకాడమీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా శ్రీను బాబు మాట్లాడుతూ యువత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వ్యాయామంతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. అనంతరం జిమ్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మహావీర్ సంస్థ మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు