పారిశుద్ధ్య కార్మికులకు చీరెల పంపిణీ
09-11-2026 | 09:35pm
ఎల్బీనగర్: దీపావళి పండుగ పురస్కరించుకుని బీఎన్ రెడ్డి నగర్ డివిజన్(BN Reddy Nagar Division)లోని వైదేహి నగర్ సంక్షేమ సంఘం(Vaidehi Nagar Welfare Association) ఆధ్వర్యంలో ఎంఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు చీరెలను పంపిణీ చేశారు. మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి హాజరై కార్మికులకు చీరెలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, స్థానికులు నర్సింహారెడ్డి, గోవర్ధన్ రెడ్డి, వెంకటేశ్వర్లు, రాజేశ్వర్, రామ్ చందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.