ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి జీవో 25 సవరించాలి
ఏన్కూర్, నవంబర్ 9 విజయక్రాంతి: ప్రభుత్వ పాఠశాలల(Government School) బలోపేతానికి జీవో 25ను వెంటనే సవరించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు షేక్ రంజాన్(TSUTF District President Shaik Ramzan) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో జరిగిన 13వ మండల మహాసభలో ఆయన మాట్లాడారు. జీవో 25 ప్రాథమిక పాఠశాలలకు(Primary school) మరణశాసనంగా ఉందని, దానిని రద్దు చేయకుండా పాఠశాలలను బలోపేతం చేయలేమని అన్నారు. స్పర్శ్ నిబంధనలు ఇబ్బందికరంగా ఉన్నాయని,ప్రధానోపాధ్యాయులు బిల్లుల కోసం దుకాణాల చుట్టూ తిరగాల్సి వస్తోందని తెలిపారు.
బకాయి డీఏలు, పీఆర్సీ అమలు, పాత పెన్షన్ కొనసాగింపు, పెండింగ్ బిల్లుల పరిష్కారం, ఆశ్రమ, గురుకుల, గిరిజన పాఠశాలల్లో పోస్టుల భర్తీ, కాంట్రాక్టుఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పించాలని జిల్లా కార్యదర్శి డీఎస్ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.అనంతరం మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బి. రామ్ చంద్, ప్రధాన కార్యదర్శిగా మూడ్ పుల్లయ్య, కోశాధికారిగా బి. నరసింహారావు ఎన్నికయ్యారు.