ఘనంగా సీఎం పుట్టినరోజు వేడుకలు
09-11-2026 | 09:31pm
ఎల్బీనగర్: లింగోజిగూడ డివిజన్(Lingojiguda division)లో ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు(Revanth Reddy birthday) వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాబు జగజీవన్ రామ్, అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు కందికంటి శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్బంగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కప్పరి శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.