అరెస్టును ఖండించిన గొర్రెల పెంపకందారుల సంఘం
ఆలేరు,(విజాయక్రాంతి): ప్రజా సమస్యలపై పోరాడుతున్న మాజీ గొర్రెల పెంపకందారుల సహకార సంఘం రాష్ట్ర చైర్మన్ దూదిమెట్ల బాలరాజును అక్రమంగా అరెస్టు చేసి మూడు రోజుల పాటు నిర్బంధించడాన్ని గొర్రెల పెంపకందారుల సంఘం(Sheep Breeders Association) నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా సోమవారం దూదిమెట్ల బాలరాజును ఆయన ఇంటిలో గొర్రెల పెంపకందారుల సంఘం నల్లగొండ జిల్లా డైరెక్టర్ దేశబోయిన సూర్యనారాయణ, జిల్లా డైరెక్టర్లు జల్లి నరసింహులు, లింగం కోటేశ్వరరావు, డేవిడ్ తదితరులు పరామర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న నాయకులను అరెస్టు చేసి నిర్బంధించడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని వారు పేర్కొన్నారు.