ఉచిత మెగా వైద్య శిబిరం
11-11-2026 | 06:39pm
హుజురాబాద్, నవంబర్ 11: విజయక్రాంతి: జమ్మికుంట పట్టణంలోని బాలికల పాఠశాలలో(Girls' school) ఈ నెల 15న ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత మెగా వైద్య శిబిరం(Free Mega Medical Camp) నిర్వహించనున్నట్లు 8వ వార్డు కౌన్సిలర్ కొలుగూరి సురేష్ తెలిపారు.
మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ఆధ్వర్యంలో హనుమకొండ బాలసముద్రంలోని అంజలి కిడ్నీ కేర్ సెంటర్ సహకారంతో ఈ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉచిత వైద్య సేవలు పొందాలని కోరారు. కార్యక్రమంలో గుల్లి ప్రతాప్, రామంచ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.