కస్టమర్లే తమకు దేవుళ్ళు..

11-11-2026 | 06:36pm

మేనేజర్ కిషోర్ కుమార్..

ఘనంగా యూనియన్ బ్యాంక్ 108 వ వార్షికోత్సవ వేడుకలు..

సుల్తానాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): కస్టమర్లే తమకు దేవుళ్ళని, వారికి సేవలు అందించడమే తమ లక్ష్యం అని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Union Bank of India) మేనేజర్ కంకణాల కిషోర్ కుమార్ అన్నారు. బుధవారం సుల్తానాబాద్ బ్రాంచ్ లో 108వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, కస్టమర్లకు మిఠాయిలు పంచారు. అనంతరం మేనేజర్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ 1919 లో స్థాపించిన ఇండియన్ బ్యాంకు సేవలను పూర్తిస్థాయిలో వినియోగదారులకు అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది సాగర్, రవీందర్, అజయ్, సాగర్, భాస్కర్, శ్రీధర్, శ్రీలేఖ, మన్వితతో పాటు కస్టమర్లు పాల్గొన్నారు,

మరిన్ని వార్తలు