మటన్ దుకాణాలను తనిఖీ చేసిన పశువైద్యాధికారి
11-11-2026 | 06:21pm
నాగిరెడ్డిపేట్,నవంబర్ 11 (విజయ క్రాంతి):వ్యాధి గ్రస్తమైన(diseased) గొర్రెలు మరియు మేకలను వధించి ఆ మాంసాన్ని వినియోదారులకు విక్రయిస్తున్నారని ఫిర్యాదు పై బుధవారం నాగిరెడ్డిపేట్ మండలంలోని గోపాల్పేట్ గ్రామంలో మటన్ దుకాణాలను మండల పశువైద్యాధికారి రవికుమార్(Veterinary Officer Ravi Kumar) తనిఖీ చేశారు.
ఆరోగ్యకరమైన గొర్రెలు మరియు మేకలను మాత్రమే వధించాలని, వినియోదారులకు ఆరోగ్యకరమైన మాంసాన్ని విక్రయించాలని దుకాణదారులకు సూచించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి రవికుమార్,పంచాయతీ కార్యదర్శి సలీం,సిబ్బంది గౌస్ గంగారం ఉన్నారు.