వింటర్‌లో హెల్తీగా ఉండాలంటే ఇవి తినండి!

11-11-2026 | 06:28pm

చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో స్వెటర్లు, జాకెట్లు బయటకు తీసే సమయం వచ్చేసింది. అయితే చలికాలాన్ని ఆస్వాదించే క్రమంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా ఈ సీజన్‌లో ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.చలికాలంలో చాలామందికి దాహం తక్కువగా వేస్తుంది. దీంతో నీరు తాగడం మర్చిపోతుంటారు. శరీరంలో నీటి శాతం తగ్గితే అలసట, తలనొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే దాహం వేయకపోయినా తగినంత నీరు తాగాలి. వేడి పప్పు, రసం, సూప్‌లను ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి శరీరానికి వెచ్చదనాన్ని అందించడంతో పాటు ద్రవాల లోటును తగ్గించడంలో సహాయపడతాయి.

అలాగే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిలోని పీచుపదార్థాలు జీర్ణక్రియ సక్రమంగా జరిగేందుకు తోడ్పడతాయి.మొత్తంగా చలికాలంలో రుచికరమైన ఆహారంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారానికీ ప్రాధాన్యత ఇవ్వాలి. చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ చలికాలాన్ని ఆరోగ్యంగా ఆస్వాదించవచ్చు.

మరిన్ని వార్తలు