ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు
ముకరంపుర,(విజయక్రాంతి): అమృత్ సర్ పథకం(Amrut Sar scheme)లో భాగంగా ఇంటింటికీ మంచి నీరు సరఫరా అవుతున్న నేపథ్యంలో ప్రగతినగర్, హనుమాన్ నగర్ కాలనీ ప్రజలతో కలిసి కరీంనగర్ నగరపాలక సంస్థ 19వ డివిజన్ కార్పొరేటర్ సుధగోని మాధవి–కృష్ణ గౌడ్(Corporator Sudhagoni Madhavi-Krishna Goud) నీటి సరఫరాను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి నీటి సరఫరా తీరును, ప్రజలకు అందుతున్న నీటి నాణ్యతను అడిగి తెలుసుకున్నారు.
ప్రతి ఇంటికి నిరంతరంగా స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా కృషి చేస్తామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు.వీరి వెంట ఇంతియాజ్ ఖాన్.పాల రాజిరెడ్డి.భాస్కర్ చారి.మహిళలు. వాటర్ సప్లై సిబ్బంది ఉన్నారు.