ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గం ఎన్నిక
ముకరంపుర, అక్టోబర్ 6 (విజయ క్రాంతి): ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (Indian Red Cross Society)కరీంనగర్ జిల్లా మేనేజింగ్ కమిటీకి నూతన కార్యవర్గం ఎన్నికల ద్వారా ఎంపికైంది. డిప్యూటీ కోఆపరేటివ్ ఆఫీసర్ సమక్షంలో నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో నూతన కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు.
నూతన కార్యవర్గంలో చైర్మన్‌గా సంగెం లక్ష్మణరావు(Sangem Laxman Rao), వైస్ చైర్మన్‌గా రాధాకృష్ణారెడ్డి, చీఫ్ అడ్వైజరీ కమిటీ చైర్మన్‌గా పెండ్యాల కేశవరెడ్డి, స్టేట్ ఈసీ మెంబర్‌గా కుందారపు మహేశ్వర్, కోశాధికారిగా గోనె శ్రీనివాస్ ఎన్నికయ్యారు. అలాగే డైరెక్టర్లుగా రాగి శ్రీనివాస్, హనుమాండ్ల రాజిరెడ్డి, కాన్పర్తి మనోహర్ రావు, చిదుర సురేష్, కోలా అన్నారెడ్డి, పెద్ది విద్యాసాగర్, సైని నరేందర్, ఎలుగందల మునీందర్, శ్రీహరి రెడ్డి, మొగలోజు రాకేష్ ఎన్నికయ్యారు.
ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కార్యవర్గ సభ్యులు ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, జేఏసీ కన్వీనర్, జిల్లా టిజీఓల అధ్యక్షులు మడిపల్లి కాళీ చరణ్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాను పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంను వారి చాంబర్లలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా కలెక్టర్ కు నూతన కార్యవర్గ సభ్యులను పరిచయం చేశారు. టీఎన్జీవోల సంఘం జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణరావు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కరీంనగర్ జిల్లా చైర్మన్‌గా ఎన్నికైన విషయాన్ని తెలియజేస్తూ, నూతన కార్యవర్గ సభ్యులను పరిచయం చేశారు.
అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ, డీఆర్ఓలను కూడా నూతన కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి తమ కార్యవర్గాన్ని పరిచయం చేసుకున్నారు. నూతనంగా ఎన్నికైన రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ సంగెం లక్ష్మణరావు మాట్లాడుతూ తమ ఎన్నికలో ఉద్యోగుల జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, జేఏసీ కన్వీనర్ మడిపల్లి కాళీ చరణ్ గౌడ్ తో పాటు ఉద్యోగ జేఏసీ నాయకులు కీలక పాత్ర పోషించారని తెలిపారు.
తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతాయుతంగా పనిచేస్తామని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆశయాలకు అనుగుణంగా సమాజ సేవలో ముందుంటామని అన్నారు. కరీంనగర్ జిల్లాలో రెడ్ క్రాస్ సేవలను మరింత విస్తృతం చేస్తామని స్పష్టం చేశారు. నూతన కార్యవర్గ సభ్యులకు టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా కార్యదర్శి ఎడ్ల అరవింద్ రెడ్డి తదితరులు అభినందనలు తెలిపారు.