పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయం..
స్వచ్ఛ భారత్ లో వారి కృషి అమోఘం..
మాజీ డిప్యూటీ మేయర్ సతీమణి నాగరాణి శ్రీనివాస్ గుప్తా..
జవహర్ నగర్ (విజయక్రాంతి): పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమోఘమని స్వచ్ఛభారత్ లో వారి కృషి అభినందనీయమని మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాసగుప్త సతీమణి నాగరాణి గుప్తా పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లో సద్దుల బతుకమ్మ(Bathukamma) పండుగను పురస్కరించుకొని జవహర్ నగర్ మున్సిపల్ లో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య మహిళా కార్మికులకు మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి నాగరాణి శ్రీనివాస్ గుప్త బతుకమ్మ పండుగ కానుకగా బుధవారం చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న కృషి అభినందనీయమని వారి సేవలను గుర్తించి వారికి అండగా నిలవడం తమ బాధ్యత అని తెలిపారు. బతుకమ్మ పండుగ తెలంగాణలోని మహిళలకు ఎంతో ప్రత్యేకమైనదని పండుగ వేళ పారిశుధ్య మహిళా కార్మికుల ముఖంలో చిరునవ్వు చూడడమే తమ లక్ష్యం అని పేర్కొన్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఎడ్ల శ్రీనివాసరెడ్డి, రాజకుమార్, శ్రీమన్నారాయణ, మౌనిక రెడ్డి, వసంత, సవిత గౌడ్, భారతి ,రజిత, వనిత, మౌనిక, పలువురు మహిళా కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్ దంపతులకు మహిళా కార్మికులు కృతజ్ఞతలు తెలియజేశారు.