24న స్వర్ణకార శంఖారావ సభ
సంఘం జిల్లా కన్వీనర్ ధర్మవరం బ్రహ్మం
సిద్దిపేట క్రైం, అక్టోబర్ 14 : ఐక్య పోరాటాలతోనే హక్కుల సాధన సాధ్యమని స్వర్ణకార సంఘం జిల్లా కన్వీనర్ ధర్మవరం బ్రహ్మం(Dharmavaram Brahmam, District Convener of the Goldsmiths' Association) అన్నారు. స్వర్ణకారుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధనే ధ్యేయంగా ఈ నెల 24న హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో స్వర్ణకార శంఖారావ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
సిద్దిపేట పట్టణంలోని మహమ్మాయి దేవాలయంలో స్వర్ణకార శంఖారావ సభ గోడ పత్రికను రాష్ట్ర కార్యదర్శి చేపూరి వెంకట్ స్వామి, రాష్ట్ర సలహాదారు ఎల్.బ్రహ్మం, మహమ్మాయి దేవాలయ కమిటీ అధ్యక్షుడు ధర్మవరం వెంకటనర్సయ్య స్వర్ణకార సంఘం ప్రతినిధులు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బ్రహ్మం మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఉన్న స్వర్ణకారులందరూ శంఖారావ సభకు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో స్వర్ణకార సంఘం, మహమ్మాయి దేవాలయ ప్రతినిధులు, ప్రభాకర్, మహేష్, బ్రహ్మం, నాగరాజు, చారి, నరేందర్, నరేష్, వెంకటేష్, కృష్ణ పాల్గొన్నారు.