16న వినియోగదారుల సమస్యల పరిష్కార సమావేశం
- విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక ఛైర్పర్సన్ కె మాధవరావు
- సద్వినియోగం చేసుకోవాలని పిలుపు
భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 14 ( విజయక్రాంతి ) : ఈనెల 16వ తేది శుక్రవారం రోజున 33/11 కేవి భూపాలపల్లి సబ్ స్టేషన్(33/11 kV Bhupalpally Substation), పైలట్ కాలని నందు భూపాలపల్లి రూరల్, ఘనపూర్ (ములుగు ), రేగొండ సెక్షన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారుల సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారం కోసం విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక (సీజిఆర్ఎఫ్ 1, వరంగల్) ఆధ్వర్యంలో వినియోగదారుల సమస్యల పరిష్కార సమావేశం నిర్వహించనున్నట్లు ఛైర్పర్సన్ కె మాధవరావు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ కనెక్షన్కు సంబంధించిన ఏవైనా సమస్యలు, విద్యుత్ బిల్లులు, మీటర్ సమస్యలు, సరఫరా అంతరాయాలు, కొత్త కనెక్షన్లు, విద్యుత్ సేవలకు సంబంధించిన ఫిర్యాదులు లేదా ఇతర ఇబ్బందులు ఉన్నట్లయితే ఉదయం 10.30 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహించే సమావేశానికి హాజరై సమస్యలను నేరుగా ఫోరం దృష్టికి తీసుకువచ్చి తగిన పరిష్కారం పొందవచ్చని సూచించారు.
అదేవిధంగా గ్రామాల్లో ఉన్న సామూహిక విద్యుత్ సంబంధిత సమస్యలను కూడా ఫోరం దృష్టికి తీసుకువచ్చి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకునేలా సహకరించాలని అన్నారు. ఈ అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.