ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నాం

14-10-2026 | 07:03pm
  1. పోచారంలో ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన ఏడాదిలో 480 ఇళ్ల నిర్మాణం లక్ష్యం
  2. రాష్ట్ర రెవెన్యూ గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఘట్ కేసర్, అక్టోబర్ 14 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy)అన్నారు. 

మేడ్చల్ నియోజకవర్గం, ఘట్ కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధి అన్నోజిగూడలోని ఎల్ఐజి కాలనీ సమీపంలో సర్వే నంబర్ 10/పి ప్రభుత్వ భూమిలో ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్స్ నిర్మాణ పనులకు రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బుధవారం శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్, స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి మంత్రులు వేదమంత్రోచ్ఛారణల నడుమ ఘనంగా శంకుస్థాపన చేశారు.

అనంతరం ​ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చి, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర  మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 'ఇందిరమ్మ ఇళ్ల' పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

క్యూర్ పరిధిలో మొదటి విడతగా లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని, 23 నియోజకవర్గాల్లో పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియను పూర్తి చేశామని వెల్లడించారు. ఇప్ప‌టికే ఆరు చోట్ల ఇందిర‌మ్మ ట‌వర్స్ నిర్మాణానికి శంకుస్ధాప‌న‌లు చేశామ‌ని వివ‌రించారు. మేడ్చల్ నియోజకవర్గంలో తొలి విడతగా 480 మంది లబ్ధిదారులను పారదర్శకమైన బహిరంగ డ్రా ద్వారా ఎంపిక చేసినట్లు తెలిపారు.

ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, ఇప్పటికే సొంత ఇల్లు ఉన్నవారిని గుర్తించి, అర్హతలను ధ్రువీకరించిన అనంతరం పారదర్శకంగా డ్రా నిర్వహించామని చెప్పారు. ఎంపికైన వారిలో స్థానికంగా నివసించే అర్హులనే నిర్ధారించి ఇళ్లు కేటాయిస్తున్నట్లు వివరించారు.

రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 2.20 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, రెండో విడతలో మరో 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేశామని వెల్లడించారు.  త్వ‌ర‌లో రెండ‌వ విడ‌త ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్ కోసం మ‌రోసారి ద‌ర‌ఖాస్తులు తీసుకుంటామ‌న్నారు. 

ఇందిరమ్మ టవర్స్‌లో ఎంపికైన లబ్ధిదారులకు కేవలం కేటాయింపు పత్రాలు ఇచ్చి సరిపెట్టబోమని, ఎలాంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేకుండా పూర్తి హక్కులతో ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసి అందిస్తామని మంత్రి ప్రకటించారు. ప్రతి అపార్ట్‌మెంట్‌కు సంబంధించిన భూమిలో వాటాను కూడా రిజిస్ట్రేషన్‌లో పొందుపరుస్తామని తెలిపారు.

వచ్చే బతుకమ్మ పండుగ నాటికి తొలి విడత లబ్ధిదారులకు ఇళ్లను పూర్తి చేసి, వారి చేతుల మీదుగా తాళాలు అందించాలన్నదే తమ లక్ష్యమని మంత్రి వెల్లడించారు. తొలి విడతలో అవకాశం దక్కని అర్హులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, తదుపరి విడతల్లో కొత్త దరఖాస్తుదారులతో సహా అర్హులందరినీ పరిశీలిస్తామని తెలిపారు.

గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడంతో పాటు, ఆయా కాలనీల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని చెప్పారు. ఖాళీగా ఉన్న ఇళ్లను గుర్తించి, సమీప ప్రాంతాల్లోని అర్హులైన పేదలకు నిబంధనల ప్రకారం కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఇప్ప‌టికే డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఉన్న కాల‌నీల్లో మౌలిక స‌దుపాయాల కోసం సుమారు 440 కోట్ల రూపాయిలు ఖ‌ర్చు చేశామ‌ని మంత్రి గారు స్ప‌ష్టం చేశారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉంది :మంత్రి శ్రీధర్ బాబు 

​మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఐటీ, పారిశ్రామిక రంగాలు వేగంగా విస్తరిస్తున్న అన్నోజిగూడ ప్రాంతంలో పేద వర్గాలకు శాశ్వత నివాసాలు కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఆనాడు ఇందిరమ్మ రాజ్యం నుంచి నేటి ప్రజా ప్రభుత్వం వరకు పేదలకు నీడ కల్పించడంలో ముందుంటుందని గుర్తుచేశారు.

ఈ టవర్ల సముదాయంలో కేవలం ఇళ్లే కాకుండా విశాలమైన రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్, అంతర్గత పార్కులు వంటి అన్ని రకాల ఆధునిక మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్…

మరిన్ని వార్తలు