వాయిపెట్ గ్రామంలో బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే
ప్రజలకు అండగా నిలుస్తా వెడ్మ బొజ్జు పటేల్..
సిరికొండ, అక్టోబర్ 16( విజయక్రాంతి ): సిరికొండ మండలం(Sirikonda Mandal) వాయిపేట్ గ్రామంలో ఇటీవల జరిగిన ఘటనకు సంబంధించి జైలుకు వెళ్లిన వారి కుటుంబాలను ఖానాపూర్ శాసనసభ్యులు, నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వెడ్మ బొజ్జు పటేల్(Vedma Bojju Patel) శుక్రవారం పరామర్శించారు. అనంతరం గ్రామస్థులతో సమావేశమై ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు, గ్రామ ప్రజలకు అండగా ఉంటానని తెలియజేశారు. ప్రజలకు కష్టకాలంలో అండగా నిలుస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతామని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ వెల్లడించారు. ఆయనతోపాటు వైపేట్ గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.