హెడ్ పోస్టాపీసు ఎదుట గ్రామీణ తపాల ఉద్యోగుల నిరసన
ముకరంపుర, అక్టోబర్ 15(విజయ క్రాంతి): తమ సమస్యల సాధన కోసం ఆల్ ఇండియా గ్రామీణ తపాల ఉద్యోగుల సంఘం(All India Gramin Postal Employees Union) పిలుపు మేరకు గురువారం కరీంనగర్ హెడ్ పోస్టాపీసు ఎదుట గ్రామీణ తపాల ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా తమ సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు.
ఎఐజిడిఎస్ యు కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ, 8వ వేతనానికి సంబంధించి కేంద్రం ప్రకటించినా, ఇప్పటివరకు గ్రామీణ తపాల ఉద్యోగుల కోసం కమిటిని ఏర్పాటు చేయలేదని, వెంటనే కమిటిని ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న బీట్ మేకానిజాన్ని కూడా పునరాలోచించాలని డిమాండ్ చేశారు.
అలాగే అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో దశల వారీగా తమ పోరు కొనసాగుతుందని సుధాకర్ హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ నాయకులు లచ్చన్న, సుగుణాకర్ లతో పాటు గ్రామీణ తపాల ఉద్యోగులు రాజేందర్, అప్సర్, జగన్ రెడ్డి, శేఖర్, మారుతి తదితరులు పాల్గొన్నారు.