కరాటేలో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థిని

30-10-2026 | 10:49pm

అభినందించిన కళాశాల చైర్మన్ బివిఆర్ గోపాల్ రెడ్డి 

కొత్తపల్లి, అక్టోబర్ 30(విజయక్రాంతి): ఇంటర్నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్(International Open Karate Championship) వారి ఆధ్వర్యంలో శినిచి షిగేయోషి కప్ -2026 శ్రీలంక లో జరిగిన కరాటే కాంపిటీషన్స్ లో కరీంనగర్ పట్టనంలోని వాగేశ్వరి ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల(Vageshwari Women's Degree and PG College)  విద్యార్థిని ఎంబడి చందన గోల్డ్ మెడల్ సాధించిన సందర్భంగా కళాశాల చైర్మన్ బీవీఆర్ గోపాల్ రెడ్డి ,జాయింట్ సెక్రటరీ డాక్టర్ రత్న గోపాల్  అభినందించి మెమంటో అందజేయడం జరిగింది.

ఈ సందర్బంగా కళాశాల చైర్మన్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ... మా  విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో కూడా ముందంజలో ఉంటారని కొనియాడారు.తదుపరి కళాశాల జాయింట్ సెక్రటరీ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే క్రీడల వైపు వెళ్లాలని మా విద్యార్థులు ల కు కళాశాల నుండి పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపల్స్ వెంకట్ రెడ్డి,సతీష్, లింగమూర్తి, వైస్ ప్రిన్సిపల్ రమణ, హెచ్ఓడి ఓంకార్ , చందు విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

మరిన్ని వార్తలు