కళాశాల బస్ ఢీకొని యువకుడు మృతి
కరీంనగర్ క్రైం,(విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలోని సుభాష్‌నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది. కరీంనగర్‌లోని కిసాన్ నగర్‌కు చెందిన రంగుల. వినయ్ (21) తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన కళాశాల బస్సు డ్రైవర్ ఓవర్టేక్(College bus driver overtaking) చేసే క్రమంలో ద్విచక్ర వాహనాన్ని పక్క నుంచి ఢీకొట్టాడు. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వినయ్ రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్ర గాయమై సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న వెంటనే కరీంనగర్ త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ తిరుమల్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో పంచనామ నిర్వహించి యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యువకుని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.