బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన యువకుడిపై చర్యలు

06-11-2026 | 12:02am

మంచిర్యాల క్రైమ్,(విజయక్రాంతి): గతంలో నేరాలకు పాల్పడి బైండోవర్ అయినప్పటికీ, తిరిగి గొడవలకు పాల్పడిన యువకుడిపై మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. శ్రీరాంపూర్ ఏరియా అరుణక్క నగర్‌కు చెందిన జలంపల్లి సందీప్ (19)ను గురువారం మంచిర్యాల ఆర్డీఓ ఎదుట హాజరుపరిచారు. గతంలో సత్ప్రవర్తనతో ఉండాలని ఆర్డీఓ ఎదుట బైండోవర్ చేసినప్పటికీ నిబంధనలు ఉల్లంఘిస్తూ తిరిగి గొడవలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

దీంతో శ్రీరాంపూర్ ఇన్‌స్పెక్టర్ ఆకుల అశోక్ ఆధ్వర్యంలో యువకుడిని ఆర్డీఓ ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఆర్డీఓ నోటీసులు జారీ చేశారు. బైండోవర్ షరతులు ఉల్లంఘించినందుకు గడువులోగా రూ.లక్ష జరిమానా చెల్లించాలని, లేనిపక్షంలో ఆరు నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. బైండోవర్‌లో ఉన్నవారు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

మరిన్ని వార్తలు