లైఫ్ లైన్ ఎక్స్ ప్రెస్ వైద్య శిబిరంలో 5500 మందికి వైద్య సేవలు

06-11-2026 | 12:19am

ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు 

కాగజ్ నగర్,(విజయక్రాంతి): కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా(Komaram Bheem Asifabad District) సిర్పూర్ కాగజ్నగర్ రైల్వే స్టేషన్ ఆవరణలో లైఫ్ లైన్ ఎక్స్ ప్రెస్, ఇంపాక్ట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5500 మందికి ఉచితంగా వైద్య సేవలు  అందించినట్లు సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు తెలిపారు. గత నెల 16 న  ప్రారంభమైన ఈ ఉచిత వైద్య శిబిరం(Free Medical Camp) గురువారంతో ముగిసింది.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు 21 రోజులపాటు నిర్వహించిన  ఈ వైద్య శిబిరంలో 427 మందికి కంటి ఆపరేషన్లు, 55 మందికి చెవి, గొంతు, ముక్కు ఆపరేషన్లు చేసినట్టు తెలిపారు.

అదేవిధంగా 500 మందికి పంటి ఆపరేషన్లు, 2124 మందికి కళ్లద్దాలు, 12 మందికి ప్లాస్టిక్ సర్జరీలు, 5 గిరికి ఎముకల ఆపరేషన్లు నిర్వహించిన ట్లు వివరించారు. ఈ సందర్భంగా  ఉత్తమ వైద్య సేవలు అందించిన డాక్టర్లు, వైద్య సిబ్బందిని ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎడిషన్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ హర్ష చౌదరి, డిఎంహెచ్ఓ నాగేందర్, డిప్యూటీ  డి ఎం హెచ్ ఓ సీతారాం, సిర్పూర్ పేపర్ మిల్లు జనరల్ మేనేజర్ గిరి , కౌన్సిలర్ శివ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు