ప్రధానోపాధ్యాయుల డిప్యూటేషన్లు రద్దు

06-11-2026 | 12:04am

డీఈఓ రమేష్ కుమార్

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): పెద్దకొత్తపల్లి, కోడేరు మండలాల నుంచి ఇతర మండలాలకు డిప్యూటేషన్‌పై వెళ్లిన ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్ఎం డిప్యూటేషన్ల(LFL HM Deputations)ను రద్దు చేసినట్లు డీఈఓ రమేష్ కుమార్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పెద్దకొత్తపల్లి మండలం(Peddakottapalli Mandal)లోని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను గుర్తించి రెండో విడత వర్క్ అడ్జస్ట్మెంట్ ద్వారా అవసరమైన ఉపాధ్యాయులను కేటాయించినట్లు తెలిపారు. విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా అందుబాటులో ఉన్న ఉపాధ్యాయులను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు