థార్ గ్యాంగ్ సంచారిస్తుంది... జాగ్రత్తగా ఉండాలి

05-11-2026 | 11:58pm

మఠంపల్లి,(విజయక్రాంతి): థార్ గ్యాంగ్ సూర్యాపేట జిల్లా(Suryapet District)లో సంచరిస్తుంది కాబట్టి పై అధికారుల ఉత్తర్వుల ప్రకారం, సమాచారం మేరకు మఠంపల్లి పోలీస్ స్టేషన్(Mathampally Police Station) పరిధిలోని సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ కాలనీ, ఎన్సిఎల్ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రాంతాలలో సబ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ మీటింగ్ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీ వాసులకు, ఫ్యాక్టరీ యాజమాన్యానికి  సెక్యూరిటీ సిబ్బందికి, మండల ప్రజాలందరికీ ఈ క్రింది సూచనలు చేశారు.

అందరూ అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. దొంగతనాలు జరిగే అవకాశం ఉంది కావున అందరూ సి.సి. కెమెరాలు, రాత్రి వేళలో సెక్యూరిటీ పెంచుకోవాలి. ఎలాంటి ఇబ్బందులు గానీ, అనుమానాస్పద కదలికలు గానీ కనిపిస్తే వెంటనే లోకల్ పోలీస్ కు గానీ లేదా 112 కు డయల్ చేయాలని, తెలియని,అనుమానిత వ్యక్తులు ఎవరైనా ప్రాంతంలోకి వచ్చినా వెంటనే పోలీస్ కు  సమాచారం ఇవ్వాలి ఎస్సై తెలిపారు.

మరిన్ని వార్తలు