అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల సేవలకు ఘన సత్కారం

06-10-2026 | 07:21pm

ప్రజా సేవలో వారి పాత్ర ఎంతో కీలకం: దేవకి వాసుదేవరావు

కూసుమంచి (విజయక్రాంతి): బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా సంకల్ప కార్యక్రమాల్లో భాగంగా మండలంలోని నేలపట్ల గ్రామంలో అంగన్ మిలాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కోశాధికారి శ్రీ దేవకి వాసుదేవరావు(Treasurer Devaki Vasudeva Rao) హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజలకు నిత్యం సేవలందిస్తున్న అంగన్‌వాడీ టీచర్లు, అంగన్‌వాడీ సిబ్బందిని శాలువాలతో ఘనంగా సత్కరించారు.

మహిళలు, చిన్నారులు, పేద కుటుంబాల ఆరోగ్యం, పోషణ, సంక్షేమం కోసం అంకితభావంతో సేవలందిస్తున్న అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల సేవలను దేవకి వాసుదేవరావు అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం, పోషణ, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో వారి పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రజా సేవలో నిరంతరం భాగస్వాములవుతున్న ప్రతి ఒక్కరి సేవలను గుర్తించి గౌరవించడం సమాజ బాధ్యత అని తెలిపారు. సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలోని వివిధ వర్గాలకు అండగా నిలవాలనే లక్ష్యంతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

“సేవే సంకల్పం… ప్రజా సేవే లక్ష్యం” అనే స్ఫూర్తితో సమాజ అభ్యున్నతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వడ్డంపూడి నరేష్. స్టేట్ కౌన్సిల్ నెంబర్ గడ్డం వెంకటేశ్వర్లు మండల ప్రధాన కార్యదర్శి గుగులోతు మహేందర్ నాయక్ చిన్నబోయిన ఉదయ్ కిరణ్. జర్పల కోటేష్, వడ్డేంపూడి వినయ్, కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు