ఎక్స్‌గ్రేషియా చెక్కులు అందించిన ఎమ్మెల్యే జారే
దమ్మపేట, అక్టోబర్ 06 (విజయక్రాంతి): అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ(MLA Jare Adinarayana) దమ్మపేట మండలంలోని పట్వారిగూడెం, జగ్గారం, నాగుపల్లి గ్రామ పంచాయతీల పరిధిలోని వివిధ గ్రామాల్లో మంగళవారం పర్యటించారు. పట్వారిగూడెం గ్రామంలో విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన కొండా వెంకటలక్ష్మి కుటుంబానికి, నాగుపల్లి గ్రామంలో విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన మారగాని విజయ కుటుంబానికి విద్యుత్ శాఖ ద్వారా మంజూరైన ఒక్కొక్కటి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కులను కుటుంబ సభ్యులకు అందజేశారు.
నాగుపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎమ్మెల్యే జారే అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఈ మహేందర్, డిఈ బద్రుపవార్, ఏడీఈ వెంకటరత్నం, ఏఈ రమేష్, ఎల్ఐలు వెంకటేశ్వర్లు, వెంకటేశ్వరరావు, ఎస్ఎల్ఐ రత్నాజీ, బూర్గుల ప్రసాద్, సర్పంచులు కూరం అర్జున్ రావు, వంకా జానకి రాముడు, ఇస్లావత్ శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వాసం శ్రీనివాసరావు, బొల్లికొండ నాగేశ్వరరావు, కుంపటి వేణు, ఎస్ వెంకట్రావు, మారగాని నాగేశ్వరరావు, వెలివెల శ్రీను, తిరుపతి రావు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.