ఇందిరమ్మ జయంతి.. ఎమ్మెల్యే దంపతుల నివాళి

20-11-2026 | 11:41am

సత్తుపల్లి, (విజయక్రాంతి): భారత మాజీ ప్రధాని, ఉక్కు మహిళ ఇందిరాగాంధీ (Indira Gandhi Birth Anniversary) జయంతి వేడుకలను సత్తుపల్లి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన రహదారిపై ఉన్న ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు మట్టా దయానంద్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటంలో ఇందిరాగాంధీ విశేష కృషి చేశారని తెలిపారు. పేదల సంక్షేమం, బ్యాంకుల జాతీయీకరణ (Bank Nationalization), హరిత విప్లవం (Green Revolution) వంటి చారిత్రాత్మక నిర్ణయాలతో దేశ అభివృద్ధిలో చెరగని ముద్ర వేశారని గుర్తుచేశారు. ఆమె ధైర్యసాహసాలు, ప్రజాసేవా స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చల్లగుళ్ల నరసింహారావు, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, మున్సిపల్ చైర్‌పర్సన్ రిహాన కమల్ పాషా, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె చెన్నారావు, మండల కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు