అర్ధరాత్రి పోలీసుల వేట.. ఆపరేషన్ నైట్ షీల్డ్!
ఆసిఫాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో గురువారం అర్ధరాత్రి ఆపరేషన్ నైట్ షీల్డ్ (Operation Night Shield) నిర్వహించారు. ఎస్పీ నితికా పంత్ ఆదేశాల మేరకు ప్రధాన కూడళ్లు, రహదారులు, పట్టణాలు, గ్రామాల్లో పోలీసులు ప్రత్యేక తనిఖీలు (Special Checks), పెట్రోలింగ్ చేపట్టారు.ఈ తనిఖీల్లో భాగంగా అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎలాంటి అవసరం లేకుండా రాత్రివేళ బయట సంచరించే వారికి కౌన్సెలింగ్ నిర్వహించి అవగాహన కల్పించారు. ప్రజల భద్రత (Public Safety), నేరాల నియంత్రణే లక్ష్యంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు.
జిల్లాలో నేరాల నియంత్రణకు ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఎస్పీ నితికా పంత్ తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ అశోక్, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.