సర్జరీలో కళ్లు చెదిరే పొరపాటు.. మహిళకు తీరని నష్టం!

20-11-2026 | 07:32am

డాక్టర్ నిర్లక్ష్యం.. మహిళకు తెలియకుండానే అండాశయాలు తొలగింపు!

హాంకాంగ్: గర్భసంచి, ఫెలోపియన్ ట్యూబ్స్ తొలగించాల్సి ఉండగా.. ఏకంగా అండాశయాలనే తీసేశాడు! వైద్యులపై నమ్మకంతో ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్లిన ఓ మహిళకు ఊహించని అనుభవం ఎదురైంది. చికిత్సలో భాగంగా అండాశయాలను తొలగించకూడదని ముందుగానే స్పష్టంగా చెప్పినా.. సర్జరీ చేసిన వైద్యుడు(Hong Kong Surgeon) వాటిని కూడా తొలగించాడు. చివరకు జరిగిన పొరపాటును స్వయంగా అంగీకరించడం హాంకాంగ్ వైద్యరంగంలో కలకలం రేపుతోంది.

ఆపరేషన్‌లో ఏం జరిగింది?

హాంకాంగ్‌కు చెందిన 45 ఏళ్ల మహిళకు గర్భాశయ సంబంధిత సమస్య కారణంగా సర్జరీ చేయాలని వైద్యులు నిర్ణయించారు. ఈ క్రమంలో గర్భసంచి (Uterus), ఫెలోపియన్ ట్యూబ్స్ మాత్రమే తొలగించాలని Treatment Plan రూపొందించారు. అయితే అండాశయాలను (Ovaries) మాత్రం అలాగే ఉంచాలని బాధితురాలు ముందుగానే నిర్ణయించుకుంది. దీనిని Pre-Surgery Consent Formలో కూడా స్పష్టంగా నమోదు చేశారు. కానీ చైనీస్ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ (CUHK) మెడికల్ సెంటర్‌లో జరిగిన ఆపరేషన్‌లో సీనియర్ గైనకాలజిస్ట్ ప్రొఫెసర్ చెంగ్ టక్-హాంగ్ అనుకోకుండా రెండు అండాశయాలను కూడా తొలగించారు. ఆపరేషన్ అనంతరం సాధారణంగా నిర్వహించే Surgical Verification సమయంలో ఓ నర్సు తొలగించిన అవయవాలను పరిశీలిస్తుండగా రెండు అండాశయాలు కూడా కనిపించాయి. వెంటనే ఆమె వైద్యుడి దృష్టికి తీసుకెళ్లడంతో అసలు విషయం బయటపడింది.

తప్పు జరిగిందని ఒప్పుకున్న డాక్టర్!

ఈ ఘటనపై స్పందించిన సర్జన్ చెంగ్ టక్-హాంగ్ తన తప్పును అంగీకరించారు. ఆపరేషన్ కొంత క్లిష్టంగా మారడంతో ఒక అంశంపైనే ఎక్కువగా దృష్టి పెట్టానని, అసలు సర్జరీ ప్రణాళికను మర్చిపోయానని వివరించారు. జరిగిన పొరపాటుకు పూర్తి బాధ్యత తనదేనని పేర్కొన్నారు. అదే రోజు రాత్రి బాధితురాలి కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం విచారం వ్యక్తం చేస్తూ బాధితురాలికి క్షమాపణలు చెప్పింది. వైద్యుడిపై ఎలాంటి Disciplinary Action తీసుకోవాలనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రకటించింది. Clinical Dutiesపై ఆంక్షలు, అదనపు పర్యవేక్షణ, హెచ్చరికలు, కాంట్రాక్ట్ రద్దు వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపింది. అయితే తుది నిర్ణయం ఇంకా ప్రకటించలేదు. మరోవైపు బాధితురాలు అదే వైద్యుడి వద్ద Follow-up Treatment కొనసాగించేందుకు అంగీకరించినట్లు ఆసుపత్రి వెల్లడించింది. ప్రతి కొన్ని నెలలకు ఉచితంగా వైద్య పరీక్షలు, సంప్రదింపులు అందిస్తామని హామీ ఇచ్చింది.

మళ్లీ ఇలాంటి పొరపాటు జరగకుండా కొత్త నిబంధనలు!

ఈ ఘటన తర్వాత ఆసుపత్రి Surgical Safety Proceduresలో మార్పులు చేసింది. ఇకపై Laparoscopic Surgery సమయంలో ఆపరేషన్‌కు సంబంధించిన ముఖ్యమైన సూచనలను ఆపరేషన్ థియేటర్ స్క్రీన్లపై నిరంతరం ప్రదర్శించనున్నారు. ఉదాహరణకు ‘Preserve Ovaries’ వంటి సూచనలు సర్జరీ పూర్తయ్యే వరకు కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తద్వారా ఆపరేషన్‌లో పాల్గొనే వైద్యులు, సిబ్బంది అందరూ ముందుగా నిర్ణయించిన Treatment Planను అనుసరించేలా చర్యలు చేపట్టారు.

మరిన్ని వార్తలు