డ్రగ్స్‌పై సమరానికి నాగ్ మద్దతు

20-11-2026 | 05:30am
  1. 25,26,27 తేదీల్లో హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్’ యాత్ర
  2. స్వయంగా ఆహ్వానించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి  
  3. సానుకూలంగా స్పందించిన అక్కినేని నాగార్జున 

హైదరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి): డ్రగ్స్ రహిత భారత నిర్మాణమే లక్ష్యంగా నిర్వహించనున్న ‘నషా ముక్త్ భారత్ యాత్ర’కు ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున(Actor Akkineni Nagarjuna) మద్దతు తెలిపారు. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి(Union Minister G. Kishan Reddy) ఆధ్వర్యంలో ఈ నెల 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న ఈ యాత్రలో భాగస్వాములు కావాలని మంత్రి కిషన్‌రెడ్డి గురువారం నాగార్జునను కలిసి ఆహ్వానించారు. అందుకు నాగార్జున సానుకూలంగా స్పందించారు.

అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ‘నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్’ పిలుపు మేరకు ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2029 నాటికి డ్రగ్స్ రహిత భారత్‌ను నిర్మించా లన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంకల్పానికి అనుగుణంగా ఈ యాత్ర చేపడుతున్నట్లు వెల్లడించారు. భావితరాల భవిష్యత్తును కాపాడేందుకు నిర్వహిస్తున్న ఈ మహా యజ్ఞంలో యువత, తల్లిదండ్రులు సహా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు.

అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. డ్రగ్స్ ప్రభావం సమాజంపై, ముఖ్యంగా యువత జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఈ మహమ్మారిని అరికట్టడం అందరూ సామాజిక బాధ్యతగా భావించాలని కోరారు. ఆరోగ్యకరమైన, డ్రగ్స్హ్రిత సమాజ నిర్మాణం కోసం చేపట్టే ఇలాంటి కార్యక్రమాలకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నషా ముక్త్ భారత్ యాత్ర టీషర్టులను వారు ఆవిష్కరించారు. 

మరిన్ని వార్తలు