ప్రపంచమే అవాక్కు! వేలంలో వాన్ గో మ్యాజిక్

20-11-2026 | 11:56am

వాన్ గో పెయింటింగ్‌కు జాక్‌పాట్.. వేలంలో రూ.1,773 కోట్లు!

ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు విన్సెంట్ వాన్ గో(Vincent Van Gogh painting) గీసిన ఓ కళాఖండం ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ఆయన మరణానికి కొద్ది నెలల ముందు చిత్రించిన పెయింటింగ్ వేలంలో ఏకంగా 190.4 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1,773 కోట్లు) పలికింది. న్యూయార్క్‌లో నిర్వహించిన ఈ Auctionలో అంచనాలను మించిన ధర రావడంతో వాన్ గో కళాఖండం సరికొత్త రికార్డు సృష్టించింది. 'ఛాటెయినియర్స్ ఎన్ ఫ్లయర్స్' పేరుతో ఉన్న ఈ పెయింటింగ్‌ను వాన్ గో 1890లో మానసిక చికిత్సాలయం నుంచి విడుదలైన తర్వాత చిత్రించారు. ఆ ఏడాది జూలైలో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆయన జీవితంలోని చివరి దశలో రూపొందిన ఈ కళాఖండానికి ప్రత్యేకమైన చారిత్రక ప్రాధాన్యం ఉంది. తాజా వేలంలో భారీ ధర పలకడంతో వాన్ గో పెయింటింగ్‌లలో ఇప్పటివరకు ఉన్న అత్యధిక విక్రయ రికార్డు కూడా బద్దలైంది.

వేలానికి ముందు హక్కుల వివాదం!

ఈ పెయింటింగ్ వేలం ప్రక్రియ అంత సులభంగా సాగలేదు. నాజీల పాలన సమయంలో జర్మనీలో ఈ చిత్రాన్ని విక్రయించిన ఓ యూదు కుటుంబానికి చెందిన వారసులు దానిపై హక్కులు కోరుతూ ముందుకొచ్చారు. దీంతో పెయింటింగ్ ప్రస్తుత యజమానులైన బ్లాకియర్-అరియేటా కుటుంబం(The Blaquier-Arrieta family), యూదు కుటుంబ వారసుల మధ్య వివాదం నెలకొంది. ఈ సమస్య వేలానికి అడ్డంకిగా మారకుండా Sotheby's మధ్యవర్తిత్వం చేసింది. ఇరు కుటుంబాల మధ్య ఒప్పందం కుదరడంతో వేలానికి మార్గం సుగమమైంది. అయితే ఆ Agreementకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు.

పాత రికార్డును తిరగరాసిన వాన్ గో!

2022లో వాన్ గో గీసిన 'వెర్జర్ అవెక్ సైప్రెస్' పెయింటింగ్ 117.2 మిలియన్ డాలర్లకు అమ్ముడై రికార్డు సృష్టించింది. తాజాగా 'ఛాటెయినియర్స్ ఎన్ ఫ్లయర్స్' చిత్రం 190.4 మిలియన్ డాలర్ల ధర పలకడంతో ఆ రికార్డు చెరిగిపోయింది. ఇదే Auctionలో ప్రముఖ చిత్రకారుడు పాల్ సెజాన్ రూపొందించిన 'ఆర్లేక్విన్' పెయింటింగ్ కూడా 111 మిలియన్ డాలర్లకు అమ్ముడైంది. మొత్తంగా ఈ వేలంలో 12 కళాఖండాలు కలిపి 412 మిలియన్ డాలర్ల భారీ మొత్తాన్ని సాధించాయి. కళా ప్రపంచంలో ఈ Auction ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు