లలిత పరమేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు
ఎర్రుపాలెం,(విజయక్రాంతి): తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం(Sri Venkateswara Swamy Temple) జమలాపురం నందు శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు(Sridevi Sharannavaratri Celebrations) నేడు ఐదవ రోజు ఉత్సవంలో భాగంగా ఉదయం 5-00 గంటల నుండి నిత్య పూజకార్యక్రమములు, అనంతరం ఉదయం 10-00 గంటలకు శ్రీ నవగ్రహ హోమం నిర్వహించినారు. ఉదయం 11 గంటలకు శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేయడం జరిగినది.
ఈరోజు అమ్మవారు లలితా పరమేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చినారు. ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించగా సుమారు 350 మంది కి స్వామి వారి అన్న ప్రసాదములు అందించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాస శర్మ ఉప ప్రధాన అర్చకులు మురళీమోహన్ శర్మ ఆలయ అర్చకులు మరియు సిబ్బంది గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు.