ఘనంగా కార్మిక బతుకమ్మ పండుగ వేడుకలు

15-10-2026 | 09:58pm

సిఐటియు జిల్లా కార్యదర్శి ఎ.అశోక్

మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్(Medchal Municipal Corporation) పట్టణంలోని మండల రెవెన్యూ కార్యాలయ పరిధిలో సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా కార్మిక బతుకమ్మ పండుగ వేడుకల(Bathukamma festival celebrations)ను నిర్వహించడం జరిగిందని మేడ్చల్ జిల్లా సిఐటియు కార్యదర్శి ఎ అశోక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ సంస్కృతికి, మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ పండుగనని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ సాయుధ ఉద్యమం(Telangana Armed Struggle)లో బతుకమ్మ కీలక పాత్ర పోషించిందని, ఆ పోరాట స్ఫూర్తితోనే మహిళా కార్మికులు తమ సమస్యలపై రాజీలేని పోరాటం చెయ్యాలని అశోక్ వివరించారు. కార్మికులు తమ నిత్య జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, కార్మికుల హక్కుల సాధన కోసం సిఐటియు నిరంతరం పోరాటం చేస్తుందని, కార్మికుల ఐక్యతే మన బలమని అశోక్ తెలిపారు.

కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కార్మికులకు న్యాయమైన వేతనాలు,ఉద్యోగ భద్రత,మెరుగైన పని పరిస్థితులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మలను పేర్చి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పారు.

మరిన్ని వార్తలు