తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ పండుగ ప్రతీక
జిల్లా కలెక్టర్ కె. హరిత
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రకృతిలో లభించే రంగురంగుల పూలను పేర్చి దేవతగా పూజించే బతుకమ్మ పండుగ(Bathukamma Festival) తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ కె. హరిత(Collector K. Haritha) అన్నారు. గురువారం ఆసిఫాబాద్ మండలం అడ గ్రామంలోని కొమురం భీం ప్రాజెక్టు ఒడ్డున గ్రామీణాభివృద్ధి శాఖ, సెర్ప్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలను జిల్లా ఎస్పీ నితికా పంత్, అటవీ శాఖ అధికారి, అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం. డేవిడ్, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ మహిళల ఐక్యతకు, ప్రకృతి ఆరాధనకు, తెలంగాణ సాంస్కృతిక(Telangana Cultural) వైభవానికి ప్రతీక అని పేర్కొన్నారు. కొమురం భీం ప్రాజెక్టు వద్ద వేడుకలు నిర్వహించడం ద్వారా పర్యాటక ప్రాంత విశిష్టతను ప్రజలకు తెలియజేయవచ్చన్నారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.ఈ కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావు, జిల్లా పౌర సంబంధాల అధికారి వై. సంపత్ కుమార్, ఐకేపీ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.