కలాం ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి

15-10-2026 | 10:01pm

మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ ఎం.డి. అహ్మద్

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం(Dr. APJ Abdul Kala) ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ ఆకాష్(Municipal Chairman Akash), వైస్ చైర్మన్ ఎం.డి. అహ్మద్ పిలుపునిచ్చారు. గురువారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కలాం జయంతి వేడుకలను నిర్వహించి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ సాంకేతిక, రక్షణ రంగాల అభివృద్ధికి కలాం చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

విద్యార్థులు, యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చిలువేరు వెంకటేశ్వర్లు, సాలం బిన్ అహ్మద్, బాలకృష్ణ, బీఆర్‌ఎస్ టౌన్ అధ్యక్షుడు అహ్మద్ బిన్ అబ్దుల్లా, నాయకులు సయ్యద్ అన్సార్, సయ్యద్ నిసార్, మోహన్ గౌడ్, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు