ప్రభుత్వ సహాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

15-10-2026 | 10:06pm

ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు 

కాగజ్నగర్, అక్టోబర్ 15 ( విజయ క్రాంతి): పేద కుటుంబాలకు చెందిన ఆడపడుచుల పెళ్లిళ్లకు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు(MLA Dr. Harish Babu) అన్నారు. గురువారం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మున్సిపల్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

కాగజ్ నగర్ మండలంలోని 82 మంది లబ్ధిదారులకు ఈ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. అలాగే సిర్పూర్ టి మండలంలోని 16 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ షాహిన్ సుల్తానా, కమిషనర్ తిరుపతి, తాహ సిల్దార్ మధుకర్, కౌన్సిలర్లు కే. జ్యోతి ,అల్లాడి రాజు, మోబిన్, సర్పంచులు రాచర్ల రజని, చనకపురి లావణ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు