డాక్టర్ విధుల్లో ఉన్నారా..?

10-11-2026 | 08:28pm

లేక విధులకే దూరమా..?

కల్లూరు పశువైద్య శాఖలో అంతులేని నిర్లక్ష్య ఆరోపణలు!

ఆసుపత్రిలో వైద్యు అధికారిని  కరువు.. రైతులకు సమాధానాలు మాత్రం ఘాటు!

ప్రశ్నిస్తే బాధ్యతాయుత సమాధానం లేదు.. పైగా నిర్లక్ష్యపు ధోరణి!

మూగజీవాల ప్రాణాలతో చెలగాటమా..? ఉన్నతాధికారుల పర్యవేక్షణ గాలికొదిలేశారా..?

కల్లూరు, నవంబర్ 10 ( విజయక్రాంతి) : మూగజీవాలకు వైద్యం(Medical care for animals) అందించాల్సిన పశువైద్యశాఖలోనే(Department of Veterinary Services) విధుల నిర్వహణపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైతులకు(Farmers') అండగా నిలవాల్సిన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయా? లేవా? అన్న అనుమానాలు కల్లూరు మండలంలో వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రికి వెళ్తే వైద్య అధికారిని కనిపించరనే ఆరోపణలు.. అత్యవసర సమయంలో వైద్యం కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు.. వీటన్నింటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? అన్న ప్రశ్నలు ఇప్పుడు మండలంలో చర్చనీయాంశంగా మారాయి.

కల్లూరు మండల పరిధిలోని చెన్నూరు గ్రామ పశువైద్య కేంద్రంలో విధులు నిర్వహిస్తూ, కల్లూరు పట్టణ పశువైద్య కేంద్రం ఇన్‌చార్జిగా కూడా వ్యవహరిస్తున్న వైద్య అధికారిని పనితీరుపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విధుల సమయంలో వైద్య అధికారిని  అందుబాటులో ఉండటం లేదని, పశువైద్య కేంద్రానికి వెళ్లిన రైతులకు వైద్య సేవలు సకాలంలో అందడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.

ఆసుపత్రి ఎక్కడ..? డాక్టర్ ఎక్కడ..?

ప్రభుత్వం ప్రజల కోసం పశువైద్య కేంద్రాలను ఏర్పాటు చేస్తే.. వాటిలో వైద్యులు అందుబాటులో ఉండాల్సిన బాధ్యత లేదా? విధుల సమయంలో వైద్యాధికారి అందుబాటులో లేకపోతే రైతులు ఎవరిని ఆశ్రయించాలి? పశువులకు అత్యవసర పరిస్థితి ఎదురైతే ఎవరు బాధ్యత వహించాలి? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రిలో అందుబాటులో లేకపోవడంపై ప్రశ్నిస్తే, రైతుల ఇళ్లకు వెళ్లి వైద్యం అందిస్తున్నామని సమాధానం చెబుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఆ సేవలు ఎప్పుడు, ఎక్కడ, ఎంతమందికి అందుతున్నాయో ఉన్నతాధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉంది.

ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేరా..? ఇదేనా అధికారుల బాధ్యత..?

విధుల నిర్వహణపై వివరణ కోరిన పాత్రికేయుల పట్ల వైద్యాధికారి స్పందించిన తీరు కూడా విమర్శలకు తావిస్తోంది. 'వార్తలు రాసుకోండి.. ఎవరికైనా చెప్పుకోండి.. మీరేం రాసుకుంటారో రాసుకోండి' అంటూ అసహనంగా స్పందించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల పన్నులతో జీతాలు తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం లేదా? విధులపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సింది పోయి నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడం ఎంతవరకు సమంజసం? అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మూగజీవాల ప్రాణాలు చవకైపోయాయా..?

పశువులే జీవనాధారంగా బతుకుతున్న చిన్న, సన్నకారు రైతులకు పశువైద్య సేవలు అత్యంత కీలకం. పశువు అనారోగ్యానికి గురైతే రైతు కుటుంబం ఆర్థికంగా కుదేలయ్యే పరిస్థితి ఉంటుంది. అలాంటి సమయంలో వైద్యుడు అందుబాటులో లేకపోతే రైతుల పరిస్థితి ఏమిటి? ప్రభుత్వ వైద్య సేవలు అందక ప్రైవేటు వైద్యులను ఆశ్రయించాల్సి వస్తే ఆ ఖర్చు ఎవరు భరించాలి? మూగజీవాలు తమ బాధను చెప్పుకోలేవు కాబట్టి వాటి సమస్యలను అధికారులు కూడా పట్టించుకోరా? అన్న ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది.

గత విమర్శలకూ స్పందన లేదా..? మార్పు ఎప్పుడు..?

గతంలోనూ వైద్యాధికారిణి  పనితీరుపై విమర్శలు వ్యక్తమైనప్పటికీ పరిస్థితిలో ఆశించిన మార్పు కనిపించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒకే అధికారికి రెండు కేంద్రాల బాధ్యతలు ఉన్న నేపథ్యంలో రెండు చోట్లా వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయా? విధుల సమయాలను ఎలా నిర్వహిస్తున్నారు? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.

ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఏమైంది..?

మండల స్థాయిలో పశువైద్య సేవల నిర్వహణపై పర్యవేక్షించాల్సిన అధికారులు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వైద్యాధికారిని హాజరు రికార్డులు, ఆసుపత్రి పని వేళలు, క్షేత్రస్థాయిలో అందించిన వైద్య సేవలు, రైతుల ఫిర్యాదులపై ఇప్పటివరకు ఎలాంటి పరిశీలన జరిగింది? అన్నది వెల్లడించాల్సిన అవసరం ఉంది. కాగితాలపై విధులు నిర్వహించినట్లు చూపిస్తే సరిపోతుందా? క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలు అందుతున్నాయా లేదా అన్నది చూడాల్సిన బాధ్యత అధికారులకు లేదా?

జిల్లా అధికారులు తక్షణమే స్పందించాలి!

చెన్నూరు, కల్లూరు పశువైద్య కేంద్రాల్లో వైద్యాధికారిని విధుల నిర్వహణపై జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు తక్షణమే విచారణ చేపట్టాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించి హాజరు వివరాలు, వైద్య సేవల రికార్డులు, రైతుల ఫిర్యాదులను పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆరోపణల్లో వాస్తవాలు తేలితే బాధ్యులపై నిబంధ…

మరిన్ని వార్తలు