కారేపల్లి ప్రభుత్వ పశువైద్యశాలలో గోపాలమిత్ర పెత్తనం

14-10-2026 | 04:30pm
  1. వైద్యాధికారి ఆంధ్రకు.. వెటర్నరీ అసిస్టెంట్ ఖమ్మంకు?
  2. తాళం వేసిన కార్యాలయాన్ని ఫొటో తీస్తే మీడియాపై గోపాలమిత్ర ఆగ్రహం!

కారేపల్లి,అక్టోబర్ 14 విజయ క్రాంతి: కారేపల్లి ప్రభుత్వ పశువైద్యశాలలో(Karepalli Government Veterinary Hospital) విధుల నిర్వహణపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఇందిర డైరీకి సంబంధించిన గేదెల ఎంపిక కోసం వైద్యాధికారి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లగా, బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వెటర్నరీ అసిస్టెంట్ ఖమ్మం వెళ్లినట్లు సమాచారం.

దీంతో కార్యాలయానికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన మీడియా ప్రతినిధులు ఫొటోలు తీస్తుండగా,అక్కడే ఉన్న గోపాలమిత్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిబ్బంది భోజనానికి వెళ్లారని తనకు తెలియని సమాచారాన్ని ఇచ్చి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు.వెంటనే కార్యాలయ తాళం తీశాడు. ప్రభుత్వ కార్యాలయంలో సిబ్బంది అందుబాటులో లేకపోవడం,విధుల నిర్వహణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

పశువులకు వైద్య సేవలు అవసరమైన సమయంలో సిబ్బంది అందుబాటులో ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది.

మరిన్ని వార్తలు