ఇందిరమ్మ జీవిత బీమా పేద కుటుంబాలకు ఆర్థిక ధీమా

23-11-2026 | 10:28pm

కేసముద్రం: తెలంగాణ రాష్ట్రంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం అని కేసముద్రం చైర్ పర్సన్ బానోత్ సునీత వెంకన్న, వైస్ చైర్ పర్సన్ అల్లం రమ నాగేశ్వర్ రావు అన్నారు. కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని 14వ, 15వ వార్డుల్లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం(Indiramma Jeevitha Bima Scheme) నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి, అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  పేద కుటుంబంలో ఎలాంటి ఆపద ఎదురైనా ఆ కుటుంబం ఆర్థికంగా కుంగిపోకుండా భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమన్నారు. కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన ప్రతి కుటుంబం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో నమోదు చేసుకొని, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ బీమా భరోసాను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టీ. శ్రీనివాసరావు, వార్డు కౌన్సిలర్లు తరాల వీరేష్ యాదవ్, దారావత్ కిషోర్, బానోత్ విజయ బద్రు, బానోత్ అరుణ కుమారి, శ్రీరామ్ కిరణ్, బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు