జిల్లా పోలీస్ శాఖకు ప్రొబేషనరీ డీఎస్పీ కేటాయింపు
భూపాలపల్లి టౌన్, నవంబర్ 23 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆదేశాల మేరకు జిల్లా స్థాయి ప్రాక్టికల్ శిక్షణలో భాగంగా ప్రొబేషనరీ డీఎస్పీ సంధన నిఖిల్ కుమార్(Probationary DSP Nikhil Kumar)ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ శాఖకు కేటాయించినట్లు జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. సోమవారం నుంచి ఆయన జిల్లా పోలీస్ శాఖ పరిధిలో నిర్దేశిత శిక్షణ కార్యక్రమం ప్రకారం జిల్లా స్థాయి ప్రాక్టికల్ శిక్షణ పొందనున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.
శిక్షణలో భాగంగా పోలీస్ శాఖ పనితీరు, క్షేత్రస్థాయి విధులు, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, పోలీస్ స్టేషన్ల నిర్వహణ, కేసుల దర్యాప్తు తదితర అంశాలపై ప్రత్యక్ష అవగాహనతో పాటు ప్రయోగిక అనుభవాన్ని పొందనున్నారు..జిల్లా స్థాయిలో అందించే శిక్షణ భవిష్యత్తులో పోలీస్ విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు దోహదపడుతుందని ఎస్పీ తెలిపారు.